అనంతపురం జిల్లా యాడికి మండల వ్యాప్తంగా భారీ వర్షాల దాటికి పలు కాలనీలు జలదిగ్బంధంమయ్యాయి. యాడికిలో ఒక మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ యాడికి ఎగువ ప్రాంతాల్లోని కొండలలో కురిసిన అతి భారీ వర్షాలకు మండలంలోని రామున్న గుడిసెల వద్ద ఉన్న చేన్నమయ్య వంక ఉదృతంగా ప్రవహించడంతో మండలంలోని పినేపల్లి గ్రామ సమీపంలో ఉన్న చెరువు నిండి, మరువవంక ఉదృతంగా ప్రవహించడంతో మండల కేంద్రంలోని ఆసుపత్రి కాలనీ, కోన రోడ్డు,ఆంజనేయస్వామి కాలనీ, లలేప్ప కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఆయా కాలనీల్లో నివసిస్తున్న ఇళ్లలోకి నీళ్లు చొరబడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే చేనేత కార్మికుల చేనేత మగ్గాలపై ఉన్న పట్టు చీరలు,చేనేత పట్టు ముడి సరుకులు వర్షపు నీటిలో పూర్తిగా నానిపోవడంతో వేలాది రూపాయలు నష్టపోయామని చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే కాలనీల్లో ఇళ్లల్లోకి ఎలా పడితే అలా వంకలు చొరబడడంతో నిత్యవసర వస్తువులు,బట్టలు సైతం పూర్తిగా తడిచి పోవడంతో కాలనీవాసులు భయాందోళన చెందారు.వేకువజామున నుండి ఉదయం వరకు కురిసిన భారీ వర్షం ధాటికి పిన్నేపల్లె చెరువు నిండడంతో పాటు మరువకొమ్మ వద్ద గండి పడటంతో చెరువులోని నీరు పిన్నపల్లి గ్రామంతో పాటు యాడికి లోని ఆసుపత్రి కాలనీ, కోన రోడ్డు కాలని తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.అలాగే స్థానిక ప్యారడైజ్ స్కూలు, వివేకానంద,విజ్ఞాన్ పాఠశాలలకు పిల్లలు,విద్యార్థులు ఎవ్వరు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని విద్యార్థుల తల్లిదండ్రులు,ఆయా పాఠశాలల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల సమయంలో అయితే ప్రమాదం ఏ స్థాయిలో ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్త పరిచారు.చెన్నమయ్య వంక ఉధృతంగా ప్రవహించడంతో రామన్నగుడిసెల గ్రామస్థులు ప్రాణాలుఅరచేతిలో పెట్టుకొని కొండయెక్కి బిక్కుబిక్కుమంటూ ఎదురు చూశారు. గ్రామంలోని కొన్ని ఆవులు కొట్టుకుపోయాయి.అలాగే వేములపాడు రోడ్డు వద్ద గ్రామానికి చెందిన రాధాకృష్ణకు సంబంధించిన 50 గొర్రెలు,వీరయ్యకు చెందిన150 గొర్రెలు మరువ వంకలో కొట్టుకుపోవడంతో లక్షలాది రూపాయలు నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని గొర్రెల కాపరులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు.విషయం తెలుసుకున్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి,వైకాపా మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, వైకాపా నేతలు, కార్యకర్తలతో కలసి ముంపునకు గురైన కాలనీల్లో విస్తృతంగా పర్యటించి, ముంపునకు గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు.అలాగే టీడీపి సీనియర్ నేత బాలా రమేష్ బాబు తన పార్టీ నేతలతో కలిసి ముంపునకు గురైన బాధితులను పరామర్శించారు.పామిడి సి ఐ రవిశంకర్ రెడ్డి,ఎస్సై మల్లికార్జున రెడ్డి అప్రమత్తమై తన పోలీసు సిబ్బందితో,ప్రత్యేక పోలీసు బలగాలతో ఎటువంటి ప్రాణనష్టం జరుగకుండా తగు జాగ్రత్తలుచేపట్టి, ప్రజలను అప్రమత్తం చేశారు.


Comments
Comments are disabled for this post.