అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు//NEWS9 TV

Share it with your friends Like

Thanks! Share it with your friends!

Close

అరకులోయ మండలం లోని గిరిజన గ్రామాల్లో శ్రీరామ నవమి వేడుక అంగరంగ వైభవం గా జరిగింది. పండగ లో బాగం గా మండలం లోని కొత్త వలస గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రామాలయం లో సీతా రాముల కళ్యాణం వైభవోపేతంగా వేద మంత్రాల మద్య కన్నుల పండగ గా జరిగింది. ఉదయం నుండే భక్తులు దేవాలయం వద్ద బారులు తీరారు. సీతారాముల కల్యాణ మహోత్సవం లో దంపతులు పాల్గొని కళ్యాణం ను వైభవం గా జరిపించారు.అలాగే మండలం లోని పప్పుడు వలస,పానిరంగిని గ్రామాల్లో సీతా రాముల కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీ రామ నవమి సందర్బంగా రాముల వారి దేవాలయాలు వద్ద ఆన్న సమారాధన కార్యక్రమాలను ఏర్పాటు చేసారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Comments

Comments are disabled for this post.