పర్యాటక కేంద్రమైన అందాల అరకులోయలో శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు బాల గణేష్ ఆధ్వర్యంలో వేద పండితులు మధ్య రుద్రాభిషేకం నిర్వహించారు.మూడు రోజుల పాటు జరుగుతున్న వెంకన్న కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారి ఊరేగింపు అతి వైభవంగా జరిగింది.ముఖ్యంగా ఆలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు విద్యుత్ దీపాలు ఆకర్షణీయంగా నిలిచాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ నాయకులు కాపుగంటి కృష్ణారావు, కొల్లా రమేష్, సమర్థి రఘునాథ్, యూత్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.


Comments
Comments are disabled for this post.